

మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల – స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ చిత్రంలో సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా చేసిన విజువల్ వర్క్‌కు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో, మణి తెల్లగూటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన అందుకుంది. రాధిక–శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాను చాగంటి ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ నిర్మించింది. ముఖ్యంగా చిత్రంలోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఫ్రేమ్ కంపోజిషన్, లైటింగ్, కలర్ టోన్స్, కెమెరా మూవ్‌మెంట్స్‌తో ప్రతి సన్నివేశాన్ని పవన్ చెన్నా ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఈ గుర్తింపుపై స్పందించిన ఆయన, ప్రతి ఫ్రేమ్ ఒక కథ చెప్పాలని, ప్రతి విజువల్ ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని కలిగించాలని తాను నమ్ముతానన్నారు. దర్శకుడి విజన్‌ను అత్యుత్తమంగా తెరపై ఆవిష్కరించేందుకు మొత్తం బృందం అంకితభావంతో పనిచేసిందని, ప్రేక్షకుల ప్రశంసలు తనకు మరింత బాధ్యతను పెంచాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!