
ఆరోగ్యం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ విదేశీ కుట్రల్లో పావుగా మారారని ఆయన ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ శక్తుల పాత్ర ఉందని, దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు.
దేశం అస్థిరతకు గురికాకముందే ప్రధాని నరేంద్ర మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని రాజా సింగ్ అన్నారు. యువత మనోభావాలను కేంద్ర ప్రభుత్వం గౌరవించిందని పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబరాలు చేసుకోవడం కంటే ప్రజలకు మంచి జరిగితేనే సంబరాలు చేసుకోవాలని సూచించారు. ఆందోళనల వెనుక ఉన్న వారి వివరాలు త్వరలోనే బయటపడతాయని ఆయన అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!