
ఆరోగ్యం

అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఫిడే తాత్కాలిక అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆనంద్ ఫిడే డిప్యూటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ప్రస్తుత ఫిడే అధ్యక్షుడు ఆర్కాడీ డ్వొర్కోవిచ్‌పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో ఆయన తాత్కాలికంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన కారణాలతో మాజీ రష్యా ఉప ప్రధానమంత్రి అయిన డ్వొర్కోవిచ్ పేరు ఆంక్షల జాబితాలో చేరింది. దీంతో ఆనంద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!