

ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో కాక్రోచ్ ల్యాబ్స్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. పార్టీకి, అమెరికాకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేకపోయినా, "కాక్రోచ్" అనే పదం ఒకటే కావడంతో నెటిజన్లు మీమ్స్, పోస్టులు వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో స్పష్టం చేయడంతో మరింత చర్చకు దారి తీసింది.
కాక్రోచ్ ల్యాబ్స్ అమెరికాకు చెందిన క్లౌడ్ డేటాబేస్ సాఫ్ట్‌వేర్ సంస్థ. ఇది ఆధునిక క్లౌడ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన కాక్రోచ్‌డీబీ (CockroachDB) అనే డిస్ట్రిబ్యూటెడ్ SQL డేటాబేస్‌ను అభివృద్ధి చేసింది. సర్వర్‌లు పనిచేయకపోయినా సేవలు కొనసాగించే సామర్థ్యం, ఆటోమేటిక్ రికవరీ, హై అవైలబిలిటీ వంటి ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. అందుకే ఎంతటి విపత్తులనైనా తట్టుకుని బతికే బొద్దింక పేరును కంపెనీ బ్రాండ్‌గా ఎంచుకుంది.
2015లో మాజీ గూగుల్ ఇంజినీర్లు స్పెన్సర్ కిమ్‌బాల్, పీటర్ మ్యాటిస్, బెన్ డార్నెల్ ఈ సంస్థను స్థాపించారు. 2021లో సిరీస్-ఎఫ్ ఫండింగ్ సమయంలో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. బెంగళూరులో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్యాంకింగ్, ఫిన్‌టెక్, ఈ-కామర్స్, టెలికాం, SaaS, AI రంగాల్లోని అనేక అంతర్జాతీయ సంస్థలు కాక్రోచ్‌డీబీని ఉపయోగిస్తున్నాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!