
ఓటీటీ

వరల్డ్ జూనియర్ స్కాష్ చాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారిణి అనాహత్ సింగ్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో 19 ఏళ్ల ఢిల్లీ క్రీడాకారిణి ఈజిప్ట్‌కు చెందిన హబీబా రిజ్క్పై 3-1తో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రెండు గేమ్‌లను 11-7, 11-5తో గెలిచిన అనాహత్‌కు మూడో గేమ్‌లో 6-11తో ఎదురుదెబ్బ తగిలింది.
అయితే కీలకమైన నాలుగో గేమ్‌లో ఒత్తిడిని అధిగమించి 11-9తో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. గత ఏడాది ఈ టోర్నీలో కాంస్య పతకం సాధించిన అనాహత్, ఈసారి మరింత మెరుగైన ఫలితం సాధించి పతకం రంగు మార్చాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!