

భారత్‌లో టెక్‌బాల్ ఇంకా అంతగా ప్రాచుర్యం పొందని క్రీడే అయినా.. క్విమ్సీ జోక్విమ్ డిసౌజా మాత్రం ఆసియా క్రీడల వేదికపై ఈ ఆటకు గుర్తింపు తీసుకొస్తోంది. 24 ఏళ్ల ముంబయి క్రీడాకారిణి మహిళల సింగిల్స్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో జపాన్‌కు చెందిన యుయినా సకామోటోపై 2-1తో విజయం సాధించిన క్విమ్సీ.. ఆ తర్వాత కంబోడియాకు చెందిన కోమ్యాన్ డీవైపై 2-0తో గెలిచింది. శనివారం ఇండోనేషియాకు చెందిన ఇమా సుమయాపై సెమీఫైనల్‌లో విజయం సాధిస్తే.. టెక్‌బాల్‌లో భారత్‌కు తొలి ఆసియా క్రీడల పతకం ఖాయమవుతుంది.
టెక్‌బాల్‌లో వంపు కలిగిన టేబుల్‌పై ఫుట్‌బాల్ నైపుణ్యాలతో బంతిని ఆడతారు. చేతులకు బదులుగా కాళ్లు, మోకాళ్లు, తొడలు, ఛాతి, తలతో బంతిని ప్రత్యర్థి వైపు పంపాలి. తొలుత ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా కెరీర్ ప్రారంభించిన క్విమ్సీ.. మహారాష్ట్ర తరఫున అండర్-19 స్థాయిలో ఆడింది. 2022లో టెక్‌బాల్‌లోకి మారిన ఆమె ఇప్పటికే పలు జాతీయ టైటిళ్లు సాధించింది. ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 24వ ర్యాంకులో ఉంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో మహ్మద్ అనాస్ ఇమ్రాన్ బెగ్‌తో కలిసి బరిలోకి దిగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!