
గాసిప్స్

సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో ఆంధ్రప్రదేశ్ మహిళా క్రీడాకారిణులు అద్భుత ప్రదర్శనతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మహిళల జట్టు ఈ పోటీల్లో వెండి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
ఈ విజయానికి మరింత మెరుపు తీసుకువచ్చేలా సూర్య చరిష్మా తరిణి మహిళల సింగిల్స్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుని అసాధారణ ప్రతిభను చాటుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాకారిణులను అభినందిస్తూ, ఇది ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన ఘట్టమని పేర్కొని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!