
జనరల్

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. అలాగే అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 14న రాత్రి 7 గంటలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ నెల 15న సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!