
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పందించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. మరో మూడు రోజుల్లో కూటమి పార్టీల నేతలు సమావేశమై సీట్ల పంపకాలపై చర్చిస్తారని చెప్పారు. అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే విధివిధానాలపై రేపు చర్చ జరగనుందని మాధవ్ వెల్లడించారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు మాధవ్ తెలిపారు. వంద శాతం విజయశాతం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. సీట్ల పంపకాలు, పోటీ విధివిధానాలపై చర్చల అనంతరం ఎన్నికలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!