
జనరల్

పారిస్‌లో తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు ప్రారంభమైంది. ఈ స్పేస్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక స్థిరత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. అంతరిక్ష రంగంలో చర్చలు, పరస్పర సహకారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోందని వెల్లడించారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవాళి కలగా ఉందని, ఆ కలను సాకారం చేసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!