

ఫిఫా ప్రపంచకప్ 2026లో అల్జీరియాపై అర్జెంటీనా ఘన విజయం సాధించిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సి హ్యాట్రిక్ గోల్స్‌తో అర్జెంటీనాకు విజయాన్ని అందించగా, మ్యాచ్ నిర్వహణపై అల్జీరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రిఫరీ నిర్ణయాలు తమ జట్టుకు అన్యాయం చేశాయని పేర్కొంటూ ఫిఫా రిఫరీయింగ్ కమిషన్‌కు అధికారిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మ్యాచ్‌లో కొన్ని కీలక సంఘటనలపై పునఃసమీక్ష చేయాలని అల్జీరియా కోరింది.
అల్జీరియా ఫిర్యాదు ప్రకారం, మెస్సి తమ జట్టు కెప్టెన్ ఐస్సా మాండీపై నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పటికీ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అలాగే అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మాక్ అలిస్టర్ కూడా తమ ఆటగాడిపై అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డాడని పేర్కొంది. మ్యాచ్ మొత్తంలో రిఫరీ అర్జెంటీనాకు అనుకూలంగా వ్యవహరించాడని ఆరోపించిన అల్జీరియా, సంఘటనలపై పూర్తి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఫిఫాను కోరింది. అయితే ఈ అంశంపై ఫిఫా లేదా అర్జెంటీనా జట్టు నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!