
క్రీడలు

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై చర్చలు ప్రారంభమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. వరుసగా కీలక మ్యాచ్‌ల్లో జట్టు పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన కోచింగ్ విధానం, నిర్ణయాలపై బీసీసీఐ వర్గాల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని ఒక మీడియా కథనం పేర్కొంది. గంభీర్‌కు గతంతో పోలిస్తే బోర్డులో ఉన్న ప్రభావం తగ్గుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కొంతమంది సీనియర్ ఆటగాళ్లు గంభీర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారని, దీనిపై బీసీసీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు కథనంలో పేర్కొన్నారు. జట్టు పరాజయాలకు బాధ్యత స్వీకరించకుండా సపోర్ట్ స్టాఫ్ లేదా ఆటగాళ్లపై నెట్టివేస్తున్నారనే అభిప్రాయం బోర్డు అధికారుల్లో ఉందని కూడా వెల్లడించింది. అయితే, ఈ అంశాలపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!