

తెలంగాణకు భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఉన్నతాధికారుల బృందంతో కలిసి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ సంస్థలతో సమావేశమై ఫ్యూచర్ సిటీతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సహకార అవకాశాలపై చర్చించనున్నారు.
విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడా రంగాల్లో ప్రపంచస్థాయి భాగస్వామ్యాలను తెలంగాణకు తీసుకురావడంపై ఈ పర్యటనలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలు, క్రీడా అకాడమీలతో భాగస్వామ్యాల ద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు కల్పించడంతో పాటు తెలంగాణను విద్య, నైపుణ్యాలు, క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!