
రాజకీయాలు

కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకం సాధించిన సెల్వ ప్రభు తనకు ఎదురైన అనారోగ్య సమస్యపై స్పందించాడు. పోటీలకు వారం రోజుల ముందు ఫుడ్ పాయిజన్ కారణంగా డయేరియా బారిన పడటంతో తీవ్రంగా నీరసించిపోయానని, అదే తన స్వర్ణ పతక అవకాశాలను దెబ్బతీసిందని వెల్లడించాడు. తాను పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉంటే తప్పకుండా స్వర్ణ పతకం సాధించేవాడిననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.
పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్ల జంప్‌తో రజత పతకం సాధించగా, సెల్వ ప్రభు 16.52 మీటర్ల జంప్‌తో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన అథ్లెట్లే కావడం విశేషం. భారత అథ్లెటిక్స్‌కు వీరి ప్రదర్శన మరోసారి గర్వకారణంగా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!