

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హరీశ్‌రావు క్షుద్ర పూజలు చేశారనే అంశానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తిరుచ్చి, శివమొగ్గ పర్యటనలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో వర్షాలు కురవకూడదనే ఉద్దేశంతో ఆయన అలాంటి పూజలు చేశారని ఆరోపించారు. ఇదే సమావేశంలో తుంగతుర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై నివేదిక అందిందని, పార్టీ చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. తనపై ఆధారాల్లేని, పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారంటూ పీసీసీ అధ్యక్షుడికి లీగల్ నోటీసు పంపించారు. ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల మానసిక అసమతౌల్యతకు నిదర్శనమని విమర్శించిన హరీశ్‌రావు, వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు దాఖలు చేస్తానని హెచ్చరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!