

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు యూఏఈలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్య దేశాలకు ఈ తేదీలను అంతర్గతంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే టోర్నీ వేదికలు, పూర్తి షెడ్యూల్, మ్యాచ్‌ల వివరాలను ఏసీసీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జట్లు ఆగస్టు 27న యూఏఈకి చేరుకుని, సెప్టెంబర్ 13న ఫైనల్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈ జట్లు పాల్గొనే అవకాశముంది. దీంతో మరోసారి మహిళల క్రికెట్‌లో భారత్-పాకిస్థాన్ హోరాహోరీ పోరును అభిమానులు వీక్షించే అవకాశం ఉంది. టోర్నీ షెడ్యూల్ ఆలస్యానికి వేదిక ఖరారు, పరిపాలనా అనుమతులే కారణమని సమాచారం. 2004లో ప్రారంభమైన మహిళల ఆసియా కప్‌లో భారత్ ఇప్పటివరకు ఏడు టైటిళ్లు గెలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అయితే 2024 ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి చవిచూసి టైటిల్‌ను కోల్పోయింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!