

బిగ్‌బాస్ హిందీ సీజన్ 20 తొలి టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా, అది అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. గుర్రంపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ 'కరణ్ అర్జున్‌లో జరిగినది ఇప్పుడు బిగ్‌బాస్‌లో జరుగుతుంది' అంటూ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో షారుక్ ఖాన్ ప్రత్యేక అతిథిగా బిగ్‌బాస్ వేదికపై కనిపించబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈసారి మొత్తం సీజన్‌లోనే ఒక పెద్ద మిస్టరీ దాగి ఉందని, టీజర్‌లోనే దానికి సంబంధించిన క్లూ ఇచ్చామని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. కొత్త డిజైన్‌తో బిగ్‌బాస్ హౌస్ సిద్ధమవుతుండగా, పలువురు ప్రముఖుల పేర్లు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హిందీ సీజన్ 20 సెప్టెంబర్ 6 నుంచి కలర్స్ టీవీతో పాటు జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!