

ఒడిశాలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్మించేందుకు అదానీ గ్రూప్ రూ.1 లక్ష కోట్ల భారీ పెట్టుబడి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 250 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ కోరగా, ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆమోదం లభిస్తే భారతీయ సంస్థ నుంచి వచ్చిన అతిపెద్ద డేటా సెంటర్ పెట్టుబడి ప్రతిపాదనగా, గూగుల్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
ఈ డేటా సెంటర్ దేశంలోని ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు ఒడిశాను కీలక డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశముంది. ముంబై, పుణె, హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టులు, చెన్నైలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కేంద్రంతో పాటు అదానీ గ్రూప్ డిజిటల్ రంగంలో తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!