

వరంగల్ ఖిలా వరంగల్‌లో గురువారం ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వరంగల్‌లోనూ అధికారిక కార్యక్రమాలు చేపట్టారు.
అయితే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఇటీవల ఆమెను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సురేఖ కార్యక్రమానికి దూరంగా ఉండటం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సెప్టెంబర్ 13న వరంగల్‌లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కొండా సురేఖ సమావేశమైన విషయం తెలిసిందే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!