

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’ విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా వాయిదా పడుతుందంటూ, చిరంజీవి మరో చిత్రం ‘విశ్వంభర’ ఆ స్థానంలో విడుదల కానుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలకు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా స్పష్టత ఇచ్చింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. దీంతో సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ సినిమా విడుదలపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలుగు చిత్రసీమలో నిర్మిస్తున్న తొలి భారీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.
అదే సమయంలో త్వరలోనే ‘కాకా’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీపై స్పష్టత రావడంతో పాటు ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానుండటంతో సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!