

ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తో విడదీయరాని అనుబంధం కొనసాగిస్తున్న మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్‌గా జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపారు. అయితే ఈ ఏడాది గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమైన నేపథ్యంలో ఆయన ఐపీఎల్ రిటైర్మెంట్, సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో సీఎస్‌కేలో ధోని వాటా కోరుతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువను ప్రస్తావిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఈ వార్తలపై స్పందించారు.
సీఎస్‌కే విలువ సుమారు 1.8 బిలియన్ డాలర్లు ఉండొచ్చని, అందులో ధోని 25 శాతం వాటా కోరారనే ప్రచారం వాస్తవంగా అనిపించడం లేదని ఆకాశ్ చోప్రా అన్నారు. 25 శాతం నుంచి 20 శాతం, ఆ తర్వాత 3.5 నుంచి 5.5 శాతం, చివరికి 2 నుంచి 3 శాతం వాటా గురించి చర్చ జరిగిందనే వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి భారీ వాటాను ఏ ఫ్రాంచైజీ అయినా ఒక వ్యక్తికి ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ ప్రచారం మొత్తం ఎవరో సృష్టించిన కట్టుకథలా కనిపిస్తోందని, ఇందులో వాస్తవం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!