

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాల ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, ‘ఏందయ్య సామి’ పాట కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

తాజాగా ‘రణబాలి’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో ఓపెన్ కాబోతోంది’ అనే క్యాప్షన్‌తో 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ లుక్ ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తుండగా, భారీ తారాగణం, బలమైన సాంకేతిక బృందంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!