

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు జాతీయ రహదారి విభాగాల అభివృద్ధికి రూ.840.41 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారి 365బీబీ పరిధిలోని బుట్టాయిగూడెం–ఎల్‌ఎన్‌డీ పేట, పట్టిసీమ–కొవ్వూరు మార్గాల్లో మొత్తం 45.09 కిలోమీటర్ల రహదారిని పేవ్డ్ షోల్డర్లతో కూడిన రెండు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుతో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. వ్యవసాయ ప్రాంతమైన ఈ ప్రాంతంలో పొగాకు, చెరకు, పామాయిల్ పంటల రవాణా వేగంగా, సురక్షితంగా జరిగేందుకు ఇది దోహదపడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య రాకపోకలు మెరుగుపడటంతో ప్రయాణికులు, వ్యాపారులు, పర్యాటకులకు ప్రయోజనం కలుగుతుంది. గోదావరి ఘాట్లు, పోలవరం డ్యామ్‌కు వెళ్లే భక్తులు, సందర్శకులకు సౌకర్యం పెరగడంతో పాటు 2027 గోదావరి పుష్కరాల సమయంలో రవాణా మరింత సులభం కానుంది. దీంతో వ్యవసాయం, పర్యాటకం, ఆధ్యాత్మిక పర్యటనలు, వాణిజ్యం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!