
బిజినెస్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) కొనసాగుతున్న సమయంలోనే స్థానిక ఎన్నికల సన్నాహాలు చేపట్టడం సరికాదని పిటిషన్‌లో పేర్కొంది. తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ ప్రక్రియను నిలిపివేయాలని కోరింది.
స్థానిక ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ హైకోర్టును అభ్యర్థించింది. తుది ఓటర్ల జాబితా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల హక్కులు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు మరింత భరోసా ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!