

నేపాల్‌లో ప్రకృతి విపత్తు తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఆకస్మిక వరదలు, జలప్రళయం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, గల్లంతైన వారిలో సుమారు 300 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 175కు చేరినట్లు సమాచారం. విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం, ఆకస్మిక వరదల కారణంగా మొత్తం 826 మంది ఆచూకీ తెలియకుండా పోయారు.
గల్లంతైన వారిలో 579 మంది పర్యాటకులు ఉన్నట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, గల్లంతైన వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను గుర్తించడంతో పాటు బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!