

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీపై ప్రేక్షకుల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గీతూ మోహన్ దాస్ గతంలో సినిమా నిర్మాణ విధానంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
సినిమా తెరకెక్కించే సమయంలో తాను స్క్రిప్ట్‌కు పూర్తిగా కట్టుబడి ఉండనని గీతూ మోహన్ దాస్ అప్పట్లో పేర్కొన్నారు. తాను రాసేది ఒకలా, చిత్రీకరించేది మరోలా, ఎడిట్ చేసేది ఇంకోలా ఉంటుందని, చివరికి సినిమా పూర్తయి విడుదలైనప్పుడు మాత్రం సంతృప్తిగా ఉంటానని చెప్పారు. స్క్రిప్ట్‌లో ఉన్నది ఉన్నట్లుగానే తెరపై కనిపించకపోవచ్చని నిర్మాతలకు ముందే చెబుతానని వెల్లడించారు. సినిమా నిర్మాణ ప్రక్రియపై నమ్మకంతో ముందుకు సాగుతానని ఆమె చెప్పిన మాటలు ‘టాక్సిక్’పై ప్రస్తుతం జరుగుతున్న చర్చల మధ్య మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!