

మోడలింగ్, యాక్టింగ్ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న శివ సృష్టి వ్యాకరణం ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ముంబైలో మోడలింగ్ చేసిన ఆమె తెలుగమ్మాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఒడియా భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. సుమారు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, స్టైలిష్ లుక్స్, డ్యాన్స్ నైపుణ్యాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2017లో ఫెమినా మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అనంతరం మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
మోడలింగ్‌తో పాటు పలు ఫ్యాషన్ షోలు, ప్రకటనలు, వెబ్ ప్రాజెక్టులు, యాక్టింగ్ అసైన్‌మెంట్లలో శివ సృష్టి వ్యాకరణం పాల్గొన్నారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోషూట్స్, డ్యాన్స్ రీల్స్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌ను షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ప్రధాన హౌస్‌లోకి ప్రవేశించేందుకు నిర్వహించిన ‘అగ్నిపరీక్ష 2’ సెలెక్షన్ ప్రక్రియలో వేలాది మంది పాల్గొన్నారు. వారిలో టాప్ 15 కంటెస్టెంట్లలో శివ సృష్టి వ్యాకరణం ఒకరిగా నిలిచారు. అగ్నిపరీక్ష ఎపిసోడ్లలో తన జీవితంలోని కష్టాలు, ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. తన బోల్డ్ యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, ఎమోషనల్ కనెక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని బిగ్‌బాస్ 10 మెయిన్ హౌస్‌లోకి వెళ్లే రేసులో గట్టి పోటీదారుగా నిలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!