

ప్రస్తుతం ప్రసారమవుతున్న ‘బిగ్‌బాస్ అగ్నిపరీక్ష’ షోపై వివాదం కొనసాగుతోంది. షో జడ్జిల్లో ఒకరైన నటుడు నవదీప్ తనను అవమానించాడంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు వరుస వీడియోలు చేసిన విషయం తెలిసిందే. తనకు జరిగిన అవమానంపై ఆవేదన వ్యక్తం చేస్తూ నవదీప్‌పై విమర్శలు చేయడంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తాజాగా నవదీప్ స్పందిస్తూ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
‘అగ్నిపరీక్ష’ అనేది కంటెస్టెంట్ల సహనం, స్పందనను పరీక్షించే కాన్సెప్ట్ అని నవదీప్ తెలిపారు. 100 మంది విభిన్న మనస్తత్వాల మధ్య ఉన్నప్పుడు వచ్చే మాటలను ఎలా తీసుకోవాలి, ఎలా నియంత్రించుకోవాలన్నదే ఈ షో ఉద్దేశమన్నారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు కంటెస్టెంట్లు ఎలా స్పందిస్తారో కూడా పరీక్షిస్తామని చెప్పారు. ‘అగ్నిపరీక్ష’లో భాగంగా కంటెస్టెంట్లను ట్రిగర్ చేయడం సహజమేనని, విమర్శలు, వ్యాఖ్యలను తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉన్నవారే షోకు రావాలని నవదీప్ స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!