
సినిమాలు

ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు బీజేపీ అధిష్ఠానం కొత్త రాష్ట్ర ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఉత్తరప్రదేశ్ బాధ్యతలను వినోద్ తావ్డేకు అప్పగించగా, కో-ఇన్‌చార్జ్‌గా జగదీష్ ఈశ్వరభాయ్ పటేల్‌ను నియమించింది. పంజాబ్ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా డా. సతీష్ పూనియాను నియమించిన పార్టీ అధిష్ఠానం, గుజరాత్ బాధ్యతలను తరుణ్ చుగ్‌కు అప్పగించింది.
రాబోయే రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, ఎన్నికల సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. కీలక రాష్ట్రాలకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. కొత్త ఇన్‌చార్జ్‌లు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!