

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఉప్పల్ బాలు ఎలిమినేషన్ వివాదానికి దారితీసింది. బిగ్‌బాస్ సీజన్ 10లోకి సామాన్యులను పంపించే ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ షోలో జడ్జీలుగా ఉన్న బిందు మాధవి, నవదీప్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉప్పల్ బాలు విషయంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన బాలు.. తనను షోకు పిలిచి అవమానించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ భార్య జ్యోతి ఉప్పల్ బాలుకు మద్దతుగా నిలిచారు. తనకు వ్యక్తిగతంగా బిగ్ బాస్ షో అంటే ఇష్టమని, ఎంతోమందికి ఈ షో అవకాశాలు ఇచ్చిందని ఆమె అన్నారు. అయితే ఉప్పల్ బాలు విషయంలో జరిగిన తీరుపై మాత్రం ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరులు వివాదాస్పద లేదా వైరల్ కంటెంట్ ద్వారా ఫేమస్ అయ్యి బిగ్‌బాస్ లోకి వచ్చిన సందర్భాలను ప్రస్తావిస్తూ.. బాలు ఎక్కువగా ప్రేక్షకులను నవ్వించేందుకే కంటెంట్ చేశాడని చెప్పారు. అతడిని మాటలతో బాధపెట్టడం సరికాదని పేర్కొంటూ.. బాధపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని, మంచి అవకాశాలు వస్తాయని జ్యోతి సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!