

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్ బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న 10వ సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య తరచూ వివాదాలు, వాగ్వాదాలు చోటుచేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ, ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో షో నుంచి ఎలిమినేట్ అయిన నటుడు కృష్ణుడు.. కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్, సోషల్ మీడియా ప్రచారం, పెయిడ్ ట్రోలింగ్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్న సమయంలో వారి సోషల్ మీడియా ఇమేజ్‌ను నిర్వహించేందుకు బయట పీఆర్ టీమ్స్ పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
తన అనుభవాన్ని వివరిస్తూ.. రోహిత్ గురించి సోషల్ మీడియాలో ఎవరైనా ప్రతికూలంగా మాట్లాడితే వారిని టార్గెట్ చేసి ట్రోల్ చేసేందుకు ఓ వ్యక్తికి నెలకు రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు తన భార్యతో ఓ వ్యక్తి చెప్పాడని కృష్ణుడు పేర్కొన్నారు. బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందు ఇలాంటి పీఆర్ వ్యూహాల గురించి తనకు తెలియదని, ఎలాంటి బాహ్య ప్రణాళికలు లేకుండానే తాను హౌస్‌లోకి వెళ్లానని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో బిగ్ బాస్ ప్రేక్షకుల్లో పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్, సోషల్ మీడియా ప్రచారాలపై చర్చ మొదలైంది. అయితే కృష్ణుడు చేసిన ఈ ఆరోపణలకు స్వతంత్రంగా ధ్రువీకరణ లభించలేదు.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!