

బిగ్ బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్ల ఆటతీరు, వ్యూహాలు సోషల్ మీడియాలో నిరంతరం చర్చకు దారితీస్తున్నాయి. అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి కామనర్‌గా అడుగుపెట్టిన ఝాన్సీ ప్రస్తుతం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. హౌస్‌లోకి రాకముందు టాస్కుల్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న ఆమె.. బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో తన ఆటను కొనసాగించలేకపోతోందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా నామినేషన్ల సమయంలో ఝాన్సీ తీసుకున్న నిర్ణయాలు, సెలబ్రిటీ కంటెస్టెంట్లతో ఆమె వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నామినేషన్ ప్రక్రియలో రైతు గెటప్‌లో కనిపించడంతో కొందరు నెటిజన్లు ఆమెను గతంలో బిగ్ బాస్‌లో పాల్గొన్న పల్లవి ప్రశాంత్‌తో పోల్చారు. సింపతీ ఆధారంగా కాకుండా తన వ్యక్తిగత ఆటతీరును చూపించాలని మరికొందరు సూచిస్తున్నారు. హౌస్‌లో ప్రవర్తన, నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆమెకు నిర్వాహకుల నుంచి హెచ్చరికలు వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఝాన్సీ గేమ్‌పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతు ఇస్తుండగా.. మరికొందరు ఆమె వ్యూహాలను ప్రశ్నిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!