

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. తొలి వారంలోనే ఇద్దరు కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో కొనసాగుతున్నారు. రెండో వారంలోకి అడుగుపెట్టగానే నామినేషన్స్ ప్రక్రియతో ఇంటి వాతావరణం వేడెక్కింది. కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం, వాదనలు, ఆరోపణలతో నామినేషన్స్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అనంతరం వినాయక చవితి సందర్భంగా బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులు పంపిన వస్తువులను అందించడంతో పలువురు కంటెస్టెంట్స్ భావోద్వేగానికి గురయ్యారు.
ఆ తర్వాత రెండో వారపు కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రకటించారు. పవర్ ఆఫ్ పీపుల్ గ్రూప్‌కు చెందిన త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలినీ, ముఖేష్, రోహిత్, ఝాన్సీ, రాంప్రసాద్ కెప్టెన్సీ రేసులో పోటీ పడ్డారు. ఇందులో భాగంగా బెలూన్ టాస్క్‌ను నిర్వహించారు. ఇచ్చిన పదాన్ని సరిగ్గా రాసిన కంటెస్టెంట్‌కు మరో సభ్యుడి బెలూన్‌ను పగలగొట్టే అవకాశం కల్పించారు. అయితే అందుకు సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో త్రిగుణ్‌కు తొలిరౌండ్‌లోనే షాక్ తగిలింది. మిగతా కంటెస్టెంట్స్ ఆయన బెలూన్లను పగలగొట్టడంతో కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నారు. అనంతరం రోహిత్, రాంప్రసాద్, దేబ్జానీ, షాలినీ కూడా టాస్క్ నుంచి వైదొలగగా, చివరకు ఝాన్సీ, అమన్ మాత్రమే తుది పోటీలో నిలిచారు.
ఇదిలా ఉంటే, తొలి వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయిన చైత్ర రాయ్, చరణ్‌లకు మరోసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. అయితే వీరిద్దరిలో ఒకరిని మాత్రమే ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా తిరిగి ఇంట్లోకి పంపించాలని నిర్ణయించారు. వీరిద్దరి ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో రీఎంట్రీ నిర్ణయాన్ని బిగ్‌బాస్ ప్రేక్షకులకే అప్పగించారు. దీంతో చైత్ర రాయ్, చరణ్ తమ అభిమానులను సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తూ తమకు ఓట్లు వేసి రీఎంట్రీకి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా వీరిలో ఎవరు తిరిగి హౌస్‌లోకి వస్తారనేది ఇప్పుడు సీజన్ 10లో ఆసక్తికర అంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!