

బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఏడు వారాలు పూర్తికాగా, గత వారం దక్షి, షాలిని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఎవరు బయటకు వెళ్లబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఎనిమిదో వారం నామినేషన్లలో వంశీ, రోహిత్, సుధీర్, సింగర్ ఝాన్సీ, రామ్ ప్రసాద్, శివ, రామకృష్ణ, వర్షిణి ఉన్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అనధికారిక ఓటింగ్ అంచనాల ప్రకారం టెంపర్ వంశీ మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తర్వాత రోహిత్ రెండో స్థానంలో ఉన్నట్లు సమాచారం. సుధీర్‌కు కూడా మంచి ఓట్లు వస్తుండగా, ఝాన్సీ గతంతో పోలిస్తే తన ఓటింగ్ స్థానాన్ని మెరుగుపరుచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు శివ, రామకృష్ణ, వర్షిణి అనధికారిక ఓటింగ్‌లో చివరి స్థానాల్లో ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సుధీర్, వర్షిణి, ఝాన్సీ, రామకృష్ణల మధ్య ఎలిమినేషన్ పోటీ ఉండొచ్చనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సుధీర్, వర్షిణిలలో ఎవరు హౌస్‌ను వీడతారనే ఆసక్తి పెరిగింది. అయితే ఈ ఓటింగ్ వివరాలు అధికారికమైనవి కావు. ఓటింగ్ ముగిసే సమయానికి పరిస్థితులు మారే అవకాశం ఉంది. రాబోయే టాస్కుల్లో కంటెస్టెంట్ల ప్రదర్శన కూడా ప్రేక్షకుల మద్దతుపై ప్రభావం చూపవచ్చు. ఈ వారం ఎలిమినేషన్‌పై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!