
జనరల్

దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు పొందేందుకు ముందస్తు స్లాట్ నమోదు చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఈ సేవలు సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ, ఏపీ సేవా పౌర సేవల పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులు స్లాట్లు నమోదు చేసుకోవచ్చు.
మొత్తం 21 రకాల వైకల్యాలకు వేర్వేరుగా స్లాట్లు కేటాయించనున్నారు. ఆమ్ల దాడి బాధితులు, అభ్యాస వైకల్యం, స్వీయ సంవేదన లోపం (ఆటిజం), బహుళ వైకల్యం వంటి కేటగిరీలకు ప్రత్యేకంగా స్లాట్ నమోదు చేసుకోవాలి. స్లాట్ నమోదు కోసం వెళ్లేవారు ఆధార్ కార్డుతో పాటు దానికి అనుసంధానమైన మొబైల్ ఫోన్ నంబర్‌ను వెంట తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ‘మన మిత్ర’ వాట్సాప్ సేవల కోసం 9552300009 నంబర్‌ను సంప్రదించవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!