

నిన్నటి బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ ఎపిసోడ్‌లో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రీన్ లెవల్‌లో ఉన్న సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. అయితే నాగార్జున విధించిన పనిష్మెంట్ కారణంగా అమన్ ఈ పోటీలో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. టాస్క్‌లో పోటీపడే కంటెస్టెంట్లు ముగ్గురు సపోర్టర్లను ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. కంటెస్టెంట్లు స్టిక్‌పై బంతిని పెట్టుకుని తీసుకెళ్లి సపోర్టర్లకు అందించాలి. వారు బోర్డ్–బాల్ గేమ్‌లో బంతిని వేయగా, అది పడిన చోట ఉన్న సూచనల ఆధారంగా కంటెస్టెంట్ల కటౌట్లను ముందుకు కదిలించాలి. ఈ టాస్క్‌లో గెలిచినవారికి హౌస్‌లో ఉన్నంతకాలం కెప్టెన్సీ పోటీల్లో నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. సపోర్టర్ల ఎంపిక విషయంలో కొంత వాగ్వాదం జరిగిన తర్వాత అమన్, వంశీ, శివ సపోర్టర్లుగా నిలిచారు. రోహిత్ సంచాలక్‌గా వ్యవహరించాడు. చివరికి త్రిగుణ్ ఈ టాస్క్‌లో విజయం సాధించి అల్టిమేట్ గోట్‌గా నిలవడంతో పాటు కెప్టెన్ అయ్యాడు.
ఆ తర్వాత రెడ్ లెవల్‌లో ఉన్న కంటెస్టెంట్లకు సడన్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించి, సూట్‌కేసులు పంపించాడు. తమ వస్తువులను సర్దుకోవాలని సూచించాడు. రెడ్ లెవల్‌లోని ఝాన్సీ, శ్వేత, రామకృష్ణ, రోహిత్, సుధీర్‌లలో ఎవరిని బయటకు పంపాలనుకుంటున్నారో వారి తలపై బాటిల్ పగలగొట్టి కారణం చెప్పాలని గ్రీన్ లెవల్ సభ్యులను ఆదేశించాడు. ఈ ప్రక్రియలో రోహిత్, రామకృష్ణ, సుధీర్‌లను పలువురు టార్గెట్ చేశారు. గ్రీన్ లెవల్ ఓటింగ్‌లో రామకృష్ణకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ, ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా సుధీర్ ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే ముకేశ్ తన ప్రత్యేక మ్యాజిక్ పవర్‌ను ఉపయోగించి ఝాన్సీకి చెందిన ఎలిమినేషన్ ఫ్రీ పవర్‌ను తిరిగి తెచ్చాడు. ఝాన్సీ ఆ పవర్‌ను సుధీర్‌ను కాపాడేందుకు వినియోగించడంతో అతడి ఎలిమినేషన్ నిలిచిపోయింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!