

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎనిమిదో వారంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆసక్తికరమైన మలుపులు ఉన్నట్లు సమాచారం. మొదట సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఎలిమినేషన్ షూటింగ్ కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, శుక్రవారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో సుధీర్ బయటకు వెళ్లినప్పటికీ, ప్రత్యేక అధికారంతో సేవ్ అయినట్లు సమాచారం. దీంతో ఈ వారాంతంలో డబుల్ ఎలిమినేషన్ ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక రెండో ఎలిమినేషన్‌లో భాగంగా రోహిత్ పేరు తెరపైకి వచ్చింది. హౌస్‌లో కొనసాగడానికి ఎవరు అనర్హులనే టాస్క్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు రోహిత్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఎలిమినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నా, ఇంటికి పంపకుండా సీక్రెట్ రూమ్‌కు తరలించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీజన్‌లో షాలినిని సీక్రెట్ రూమ్‌కు పంపించి తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు రోహిత్‌ను కూడా అదే విధంగా పంపిస్తే, ఒకే సీజన్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు సీక్రెట్ రూమ్‌కు వెళ్లిన తొలి సందర్భం కానుంది. అయితే ఈ పరిణామాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!