

ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండగా.. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉండగా.. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన ఆరు బృందాలను సిద్ధంగా ఉంచారు. సహాయక చర్యల కోసం రాష్ట్ర విపత్తు స్పందన దళానికి చెందిన ఏడు బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. సముద్రంలో అలజడి ఉండే అవకాశం నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!