
జనరల్

ఆంధ్రప్రదేశ్లోని 12 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. గతంలో జరిగిన పోలింగ్లో తలెత్తిన సమస్యల నేపథ్యంలో ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. అనంతపురంలోని 30వ వార్డులో 30/3 పోలింగ్ స్టేషన్, ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని 14వ వార్డులో 14/1 పోలింగ్ స్టేషన్లో తిరిగి ఓటింగ్ జరుగుతోంది.
అలాగే మాచర్లలోని 23వ వార్డులో 23/1, 23/2 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. పులివెందులలో 1, 3, 7, 8 వార్డులకు చెందిన 1/1, 3/1, 7/1, 8/1 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కడపలోని 15వ వార్డులో 15/2 పోలింగ్ స్టేషన్లోనూ రీపోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!