

బిగ్‌బాస్ తెలుగు 10 డే 28 రివ్యూ: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారం సండే ఎపిసోడ్‌తో ముగిసింది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ఎపిసోడ్‌లో సరదా టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య ఆసక్తికరమైన చర్చలు, ఎలిమినేషన్ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఎపిసోడ్‌లో హీరో, హీరోయిన్లకు సంబంధించిన వస్తువులను చూపించి సినిమా పేర్లను గుర్తించే టాస్క్‌ను నాగార్జున నిర్వహించారు. ముందుగా ముఖేష్, దేబ్జానీ సేఫ్ అయినట్లు ప్రకటించగా, ఆ తర్వాత నరేష్, చరణ్, త్రిగుణ్ సేఫ్ అయ్యారు. అనంతరం రెండు టీమ్‌ల నుంచి కంటెస్టెంట్లు పాల్గొనే మరో సరదా టాస్క్ జరిగింది. నాగార్జున చెప్పిన సమాధానంతో తమ సమాధానం మ్యాచ్ అయితే చాక్లెట్ గెలుచుకునే ఈ గేమ్‌లో గర్ల్స్ టీమ్ విజయం సాధించింది. మెజార్టీ ఓట్ల ఆధారంగా ఝాన్సీని ఈ వారం స్టార్ ప్లేయర్‌గా నాగార్జున ప్రకటించారు.
ఎపిసోడ్‌లో ప్రధాన హైలైట్‌గా శ్రిష్టి ఎలిమినేషన్ నిలిచింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు శ్రిష్టి పలువురు కంటెస్టెంట్ల ఆటతీరుపై తన అభిప్రాయాలను వెల్లడించింది. రాం ప్రసాద్, వర్షిణి, ముఖేష్ ఇంకా మాస్కులు వేసుకుని ఆడుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. రాం ప్రసాద్ తన మాటలతో ఇతరులను ప్రభావితం చేస్తున్నారని కూడా చెప్పింది. ఈ చర్చలో చరణ్ చేసిన వ్యాఖ్యలకు నాగార్జున తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. డబ్బులు ముఖ్యం కాదని, కప్పు ముఖ్యమని చరణ్ చెప్పగా.. నీకు ఆట కూడా ముఖ్యం కాదంటూ నాగ్ సెటైర్ వేశారు.
మరోవైపు ఐదు గ్రూపులుగా ఇంటి సభ్యులను విభజించి, ప్రతి గ్రూపులో ఒక కెప్టెన్‌ను ఎంపిక చేశారు. ఆ కెప్టెన్లను ఎవరిని కాపాడతారు, ఎవరిని ముంచుతారు అని నాగార్జున ప్రశ్నించగా.. కంటెస్టెంట్లు తమ వ్యూహాలను వెల్లడించారు. అనంతరం రోహిత్, అమన్ సేఫ్ అయినట్లు ప్రకటించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రమోషన్‌లో భాగంగా ఝాన్సీ.. ముఖేష్ కోసం షాపింగ్ చేసింది.
చివరగా శ్రిష్టి ఎలిమినేట్ కాగా, షాలినీ సేఫ్ అయ్యారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో శ్రిష్టి ధైర్యంగా కనిపించింది. అయితే తన బిగ్‌బాస్ జర్నీకి సంబంధించిన వీడియో చూసిన సమయంలో మాత్రం భావోద్వేగానికి గురైంది. అనంతరం వచ్చే వారం ‘రోడ్ టు రీలోడ్’ అనే కొత్త థీమ్‌తో షో కొనసాగుతుందని నాగార్జున ప్రకటించారు. దీంతో ఐదో వారంలో ఇంటి సభ్యుల మధ్య ఎలాంటి కొత్త గేమ్‌లు, వ్యూహాలు, పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!