

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో నాలుగో వారం ‘టోటల్ డామినేషన్’ టాస్క్‌లు కొనసాగుతున్నాయి. రెండు టీమ్‌లుగా విడిపోయిన కంటెస్టెంట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో టాస్క్‌లోనూ భైరవ టీమ్ విజయం సాధించడంతో, సప్తశక్తి టీమ్ నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. భైరవ టీమ్ ఏకాభిప్రాయంతో త్రిగుణ్‌ను ఎంపిక చేయడంతో, ఆయన నుంచి బ్లూ బ్యాడ్జ్‌ను తొలగించాలని బిగ్‌బాస్ సూచించాడు. అనంతరం రెండు టీమ్‌ల మధ్య ‘సైల్ టు నామినేట్’ టాస్క్‌ను నిర్వహించగా, ఇందులో మహిళా కంటెస్టెంట్లు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ టాస్క్‌లో బ్లూ టీమ్ తరఫున సృష్టి, దేబ్జానీ, షాలిని చర్చించుకున్నారు. తాను టాస్క్‌లో పాల్గొంటానని షాలిని చెప్పగా, దేబ్జానీ అందుకు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన షాలిని బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. సృష్టి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినా షాలిని తీవ్రంగా స్పందించింది. అనంతరం దేబ్జానీ తన నిర్ణయానికి గల కారణాలను సృష్టికి వివరించింది. షాలిని ప్రతి విషయాన్నీ భావోద్వేగంగా తీసుకుంటుందని ఆమె పేర్కొంది. టీమ్ సభ్యులు మాట్లాడేందుకు ప్రయత్నించినా షాలిని తనకు అవకాశం వచ్చినప్పుడు తన సత్తా నిరూపించుకుంటానని చెప్పింది. చివరగా రోహిత్ వద్దకు వెళ్లి తాను నిజంగా టాస్క్‌లో ఆడలేనని అనుకుంటున్నారా అంటూ వెక్కి వెక్కి ఏడవడంతో ప్రోమో ముగిసింది.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!