

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 18లో కంటెస్టెంట్ల మధ్య ఆసక్తికరమైన టాస్క్ జరిగింది. బిగ్ బాస్ స్టేజ్‌పై ఎవరు ఎంత వర్త్, ఎవరికి ఎంత స్పేస్ ఉంటుందో నిర్ణయించే విధంగా 15, 30, 45, 60 సెకన్ల కేటగిరీలుగా కంటెస్టెంట్లను విభజించారు. ఈ టాస్క్‌లో షాలిని, రామకృష్ణ, అపూర్వ, రాజకుమారి తదితరుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. చివర్లో రోహిత్ తన సమయస్పూర్తితో ఇచ్చిన సమాధానంతో జ్యూరీని ఆకట్టుకున్నాడు.
15 సెకన్ల బ్యాడ్జ్ పొందిన ఐదుగురికి లీడర్ అయ్యే అవకాశం కల్పిస్తూ మరో టాస్క్ ఇచ్చారు. భారీ దోశను ముందుగా పూర్తి చేసిన భాగీ తన టీంను ఏర్పాటు చేసుకుంది. అనంతరం జరిగిన పోటీలో అపూర్వ, రాజకుమారి కలిసి అద్భుతంగా ఆడి విజయం సాధించారు. దీపక్ ఫైర్ కార్డ్ ఉపయోగించి టీంలను మార్చినా, అపూర్వ, రాజకుమారి వేగంగా పజిల్ పూర్తి చేసి గెలిచారు. వారి ఆటతీరుకు జ్యూరీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. అపూర్వకు ఓట్ అప్పీల్ దక్కగా, రాజకుమారిని మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ఓడిపోయిన టీం లీడర్ భాగీకి ఎల్లో కార్డ్ ఇచ్చి డేంజర్ జోన్‌లోకి పంపారు. దీంతో దీపక్ తన వల్లే టీం ఓడిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!