

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్ల ఎంపిక, కొత్త టాస్కులు, మార్పులపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి సామాన్యులకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. కొందరి కథనాల ప్రకారం ఆరుగురు కామన్ మ్యాన్, మరో ఆరుగురు సెలబ్రిటీలను తీసుకోనున్నారని, మరికొన్ని నివేదికలు తొమ్మిది మంది సెలబ్రిటీలతో పాటు ఆరుగురు సామాన్యులు హౌస్‌లోకి వెళ్లనున్నారని చెబుతున్నాయి. అయితే అసలు లెక్క ఏమిటన్నది సెప్టెంబర్ 6న మాత్రమే తేలనుంది.
కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్‌లోకి వెళ్లే వారికి కూడా ఈసారి భారీ పారితోషికం దక్కనున్నట్లు సమాచారం. ‘అగ్నిపరీక్ష’ ద్వారా టాస్కుల్లో ప్రతిభ చూపించి ఎంపికైన ఆరుగురికి వారానికి సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ పడాల, డెమోన్ పవన్, ఆదిరెడ్డి, ప్రియా శెట్టి తదితరులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు టెలివిజన్ కార్యక్రమాలు, సీరియళ్లలో అవకాశాలు కూడా అందుకున్నారని ప్రచారం ఉంది.
ఈసారి ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన వారిలో అమన్ మసూద్, అపూర్వ, ఝాన్సీ, శాలిని, గాయత్రి, చరణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఝాన్సీ అగ్నిపరీక్షలో చూపిన ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, ఆమె టైటిల్ రేసులో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ పడాల వంటి కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు టైటిల్ గెలుచుకోవడంతో ఈసారి కూడా సామాన్యులే ట్రోఫీని అందుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. అయితే కంటెస్టెంట్ల తుది జాబితా, వారి పారితోషికాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!