

ఈ నెల 6న గ్రాండ్‌గా ప్రారంభం కానున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, కంటెస్టెంట్లుగా పలువురి పేర్లు వినిపిస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. ఈసారి షోలో పలు మార్పులతో పాటు టాస్కులు మరింత ఆసక్తికరంగా, కఠినంగా ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. అగ్నిపరీక్ష మొదలైనప్పటి నుంచే సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ పేరు బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్‌గా వినిపిస్తోంది. ఆమె పేరు అధికారికంగా ప్రకటించకపోయినా, ఇన్‌సైడ్ టాక్ ప్రకారం వర్షిణి ఈ సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆమెకు ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే అధిక పారితోషికం దక్కనుందని, సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వర్షిణి సౌందరరాజన్ యాంకర్‌గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పటాస్ 2’, ‘జబర్దస్త్’ వంటి కార్యక్రమాలతో తన ప్రత్యేక యాంకరింగ్ స్టైల్, చురుకైన మాటతీరు, ఎనర్జిటిక్ ప్రజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటిగా ‘చందమామ కథలు’, ‘లవర్స్’, ‘జోడి’, ‘మళ్లీ మొదలైంది’, ‘శాకుంతలం’ వంటి చిత్రాల్లో కనిపించారు. అయితే బిగ్‌బాస్ 10లో ఆమె పాల్గొంటారా? అత్యధిక పారితోషికం పొందుతారా? అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత లేదు. నిర్వాహకుల ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!