

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ కొత్త సీజన్ల సందడి మొదలుకానుంది. ఈసారి దక్షిణ భారతదేశంలోని నాలుగు ప్రధాన భాషల్లో బిగ్‌బాస్ సీజన్లు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఎడిషన్ల కొత్త సీజన్లు సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. దీనికి మరింత హైప్ తీసుకొచ్చేలా ఆయా భాషలకు హోస్టులుగా వ్యవహరిస్తున్న నాగార్జున, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్ ఒకే ప్రమోషనల్ వీడియోలో కనిపించారు.
నలుగురు హోస్టులు టిఫిన్ ఆర్డర్ చేయడం.. ఒకరు ఆర్డర్ చేసిన ఫుడ్ మరొకరికి రావడం వంటి ఫన్నీ కాన్సెప్ట్‌తో ఈ ప్రోమోను రూపొందించారు. నాలుగు వేర్వేరు ఇళ్లు, నాలుగు భాషలు ఉన్నా వినోదం మాత్రం ఒకే వేదికపై అందించబోతున్నామనే భావనను ఈ సరదా సన్నివేశం ద్వారా చూపించారు. ‘ఫోర్ సూపర్‌స్టార్స్.. ఫోర్ హౌసెస్.. వన్ ఎపిక్ మోమెంట్’ అంటూ మేకర్స్ ప్రచారం చేస్తున్నారు. నలుగురు స్టార్ హోస్టులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కొత్త కంటెస్టెంట్లు ఎవరు? ఎలాంటి టాస్కులు, నిబంధనలు ఉండబోతున్నాయి? అనే ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 6న నాలుగు ఎడిషన్లు ఒకేసారి ప్రారంభం కానుండటంతో సౌత్ బుల్లితెరపై భారీ వినోద విందు ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!