

కుల గణన డిమాండ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) మద్దతు ప్రకటించింది. అన్ని రంగాల్లోనూ అన్ని కులాలు సమానంగా అభివృద్ధి సాధించాలంటే కులాల వారీగా కచ్చితమైన గణాంకాలు అవసరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కుల గణన ప్రక్రియలో ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) కాలమ్‌ను తప్పనిసరిగా చేర్చాలని ఆయన సూచించారు. అలాగే, గణన ప్రక్రియలో ఏ కులాన్నీ విస్మరించకుండా సమగ్రంగా వివరాలు సేకరించాలని స్పష్టం చేశారు.
కుల గణన కోసం అన్ని కులాలను పొందుపరిచే సమగ్ర డ్రాప్‌డౌన్ మెనూను రూపొందించాలని వైఎస్ జగన్ సూచించారు. కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తెలియజేసే సూచికలను కూడా గణనలో భాగంగా చేర్చాలని పేర్కొన్నారు. కులాల వారీగా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటే విధానాల రూపకల్పనతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ డిమాండ్‌కు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందని వెల్లడించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!