

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టును అసలు డీపీఆర్ ప్రకారం 45.72 మీటర్ల పూర్తి నీటి మట్టం (FRL) వద్ద పూర్తి చేయాల్సి ఉండగా, 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేయడం ద్వారా ప్రాజెక్టు లక్ష్యాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల సాగునీరు, తాగునీరు, బహుళార్థక ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందవని ఆమె పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తొలి దశలో ప్రజలకు అందే ప్రయోజనాలు, రెండో దశ పనులపై స్పష్టత, పునరావాసం–పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్) కోసం అవసరమైన నిధులు, ప్రాజెక్టు పూర్తి గడువుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. 41.15 మీటర్ల ఎత్తులో ఎంతమంది రైతులకు సాగునీరు, ఎంతమందికి తాగునీరు అందుతుందో వెల్లడించాలని, రెండో దశకు కేంద్రం నుంచి ఖచ్చితమైన హామీ ఎందుకు తీసుకురాలేదని ఆమె ప్రశ్నించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!