

భారత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్లీ రాజకీయ రంగాన్ని కుదిపేశారు. ఈసారి ఆయన ఆరోపణల దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉన్న ఓటు మోసాలపైనే పడింది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ ఒక మహిళా ఫొటోను చూపించి మీడియా ప్రతినిధులను అడిగారు - “ఆమె ఏ రాష్ట్రానికి చెందినది?” అని. కొందరు గోవా, మరికొందరు మహారాష్ట్ర అని చెప్పారు. అయితే రాహుల్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది - “ఆమె భారతీయురాలు కాదు, బ్రెజిలియన్ మోడల్ ఫొటో!” ఆ ఫొటోను హర్యానాలో జారీ చేసిన పలు ఓటరు కార్డులపై ఉపయోగించారని ఆయన వెల్లడించారు. ఒకే వ్యక్తి ఫొటోతో 22 సార్లు, 10 బూత్‌లలో ఓటు వేసినట్లు చెప్పారు. ఈ తప్పుడు ఓటర్ల సృష్టి ఒక వ్యవస్థాత్మకమైన మోసం అని రాహుల్ ఆరోపించారు.
ఈ ప్రెస్‌మీట్ అనంతరం ఆ ఫొటోలో ఉన్న మోడల్ మాథ్యూస్ ఫెర్రెరో అనే బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి అని సోషల్ మీడియాలో బయటపడింది. ఆమె ఫొటోలు, రాహుల్ చేసిన ఈ వెల్లడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనతో ఎన్నికల పారదర్శకత, డేటా భద్రతపై కొత్త చర్చ మొదలైంది. రాజకీయ వర్గాల్లో “ఓటు మోసం” పై మరోసారి వేడి చెలరేగింది.









.jpg&w=3840&q=75)
కామెంట్స్ (2)
interestingg
Wow, this is shocking!