

మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యవహారశైలిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ సభ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య జరిగిన వివాదంపై వివరణ ఇవ్వాలని కోరుతూ గురువారం గాంధీభవన్‌కు రావాలని పీసీసీ చీఫ్ ఆదేశించారు. వారి నుంచి వివరణ తీసుకునేందుకు ఆయన గంటల తరబడి ఎదురుచూసినా.. ఇద్దరూ అక్కడికి రాలేదు. అంతేకాకుండా పీసీసీ చీఫ్ అభ్యర్థనకు సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అసంతృప్తికి గురైన మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు.
ఇద్దరు నేతల తీరు పీసీసీ నాయకత్వాన్ని అవమానించేలా ఉందని పేర్కొంటూ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధిష్ఠానం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మరోవైపు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా పీసీసీ చీఫ్ పార్టీ పెద్దలకు నివేదిక పంపినట్లు తెలిసింది. ఆయన వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!