
క్రీడలు

ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో రష్యా పై దాడి చేసింది. ఈ ఘటనలో భారతీయ కార్మికుడితో సహా నలుగురు మరణించగా, మరో ముగ్గురు భారతీయ కార్మికులు సహా పలువురు గాయపడ్డారు. ఘటనపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా స్పందించి వివరాలను ధృవీకరించింది.
దాడి జరిగిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించినట్లు, గాయపడిన భారతీయ కార్మికులను ఆసుపత్రిలో పరామర్శించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రాణనష్టం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన రాయబార కార్యాలయం, బాధిత భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులు, కంపెనీ యాజమాన్యంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!